Home  »  TV News  »  Eto Vellipoyindhi Manasu : తమ్ముడిని గొప్పగా పొగిడి‌న అన్నయ్య.. ఆ నిజం కనిపెట్టగలదా!

Updated : Jul 26, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -158 లో.. సీతాకాంత్ మీటింగ్ లో సందీప్ ని మెచ్చుకుంటాడు. ఇంత తక్కువ టైమ్ లో కంపెనీ ని కావలసిన ల్యాండ్ రెడీ చేసావ్.. నువ్వు నా తమ్ముడు అయినందుకు గర్వంగా ఉందంటూ గొప్పగా పొగుడుతాడు. ఆ డాకుమెంట్స్ చూసారా అని రామలక్ష్మి అడుగగా.. చూసానని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే వైస్ చైర్మన్ ని చేస్తానని అనగానే సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదో చేస్తున్నాడు ముందు.. అది కనుక్కోవాలని రామలక్ష్మి అనుకుంటుంది.

ఆ తర్వాత సందీప్ కోసం ఒక పెద్దాయన ఆఫీస్ కి వస్తాడు. అప్పుడే సందీప్ అతని దగ్గరికి వస్తాడు. మీరు కొన్న ల్యాండ్ ఓనర్ ని.. ఒకతనికి అమ్మాను.. వాడు బ్రోకర్.. ఆ ల్యాండ్ మిమ్మల్ని మోసం చేసి అమ్ముతున్నాడు.. అది మీకు ఉపయోగపడదని పెద్దాయన అంటుంటే.. నీకు అనవసరం పెద్దవాళ్ళ మ్యాటర్. అందులో ఇన్వాల్వ్ అవ్వకండి .. మీకేమైన కావాలంటే ఆ బ్రోకర్ ని అడిగి ఇప్పిస్తాను.. మీరు ఈ విషయం ఎక్కడ చెప్పొద్దంటూ సందీప్ అతనిపైన కోప్పడతాడు. అదంతా దూరం నుండి మాణిక్యం చూస్తాడు.. కానీ అతనికి ఏం అర్థం కాదు.. వెళ్లి రామలక్ష్మికి చెప్తాడు. నువ్వు డౌట్ పడుతుంది నిజమే అమ్మ.. ఎవరో పెద్దాయన ల్యాండ్ అంటు వచ్చాడని మాణిక్యం అంటాడు. అదేంటో కనుక్కోవాలి నాన్న.. నువ్వు ఆ పెద్దాయన అడ్రెస్ ఎక్కడో కనుక్కోమని రామలక్ష్మి అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావనగానే రామలక్ష్మి డబ్బులు తీసి మాణిక్యానికి ఇస్తుంది. డబ్బుల కోసం వచ్చావా అని సీతాకాంత్ అంటాడు. ఇక వెళదామా అంటు రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ ఇంటికి వెళ్తాడు.

ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వెళ్ళగానే.. సందీప్ చేసిన పనిని గొప్పగా చెప్తాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. వంట నేను చేస్తానని చెప్తాడు.. ఆ తర్వాత సీతాకాంత్ వంట చేస్తుంటే రామలక్ష్మి హెల్ప్ వేస్తుంది. అందరు భోజనం చేస్తుంటే వంటలు బాగున్నాయని అంటారు. వంటలు కాదు మాకు బాబునో పాపనో ఇవ్వండి అని పెద్దాయన అంటాడు. ఆ కోరిక అత్తయ్యకి లేదేమో అని రామలక్ష్మి అనగానే.. ఎందుకు అలా అంటున్నవని శ్రీలత అంటుంది. అలా మీకు ఉంటే ఇన్నాళ్లు కగా సీతా ర్ కి పెళ్లి ఎందుకు చెయ్యలేదని రామలక్ష్మి అంటుంది. దాంతో నేనేం చెయ్యను అన్లేదని శ్రీలత అంటుంది. నువ్వు బాబునో పాపనో ఎప్పుడిస్తున్నావ్ చెప్పమని శ్రీలత అనగానే.. అయినా మమ్మల్ని అంటున్నారేంటి మా కన్న ముందు పెళ్లి అయిన శ్రీవల్లి, సందీప్ లని అడగండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.